నేడు కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్‌తో ప్రధాని భేటీ
నేడు కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్‌తో ప్రధాని భేటీ | కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, భారతీయ జనతా పార్టీ

న్యూఢిల్లీ : కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా సహా మరికొందరు మంత్రులు సైతం భేటీకి హాజరుకానున్నారు. సమావేశం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నివాసంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లోకి కనీసం 18 మంది కొత్త మంత్రులను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రిత్వశాఖలతో పాటు సరిగా పని చేయని మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే పలుసార్లు మంత్రిత్వశాఖల పనితీరుపై ప్రధాని సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేబినెట్ విసర్తణ జరిగే అవకాశం ఉన్నది. కేంద్ర మంత్రివర్గాన్ని బుధవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ ప్రధాన కార్యదర్శి (సంస్థ) బీఎల్ సంతోష్‌తో బీఎల్ సంతోష్‌తో ప్రధానికి సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ కూర్పుపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ ప్రధాని కేంద్ర మంత్రులతో మరోసారి భేటీ నిర్వహిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
ఫంగస్, బ్యాక్టీరియాల.. ‘చెవి’మెలి తిప్పండి!
అతిసార బారినపడితే..
తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన
Good News : భారత్ ప్రయాణికులపై నిషేధం ఎత్తివేసిన జర్మనీ
ఘోరం : రెండు ట్రక్కుల ఢీ.. డ్రైవర్ మృతి
హర్యానాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
కుమ్రంభీంలో దారుణం.. మామను హత్య చేసిన అల్లుడు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

