న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఉప ఎన్నికలు జరుగుతున్న 13 రాష్ర్టాల్లోని 3 లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 50-75 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. దాద్రా నగర్ హవేలీ లోక్సభ స్థానంలో 75.51 శాతం, హిమాచల్ ప్రదేశ్లోని మండిలో 49.83 శాతం పోలింగ్ జరిగింది. మండిలో స్వతంత్ర భారత తొలి ఓటరు, 104 ఏండ్ల శ్యామ్ శరణ్ నేగి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.