హైదరాబాద్ : సంక్రాంతికి(Sankranti) సొంత ఊరికి వెళ్లే ప్రయాణికులతో రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. అత్యధిక సంఖ్యలో పట్నం నుంచి ఊరుబాట పట్టారు. ఓవైపు సరిపడా లేని ఆర్టీసీ బస్సుల్లో(Rtc bus) ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి బయలుదేరే అన్ని బస్సులూ పరిమితికి మించి ప్రయాణిస్తున్నాయి. బస్తాండ్ వచ్చిన క్షణాల్లోనే బస్సులు నిండిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది.
టీజీఎస్ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా ప్రయాణికుల సమస్యలను తీర్చలేకపోతున్నాయి. బస్సులు సరిపడా లేకపోవడంతో చాలా మంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు కార్పూలింగ్ సేవలు కూడా వినియోగించుకుంటున్నారు.