Pantangi toll plaza | పంతంగి టోల్ పాజా వద్ద వాహనాల రద్దీ..ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలన్న పోలీసులు
చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా(Pantangi toll plaza) వద్ద వాహనాలు నెమ్మెదిగా కదులుతున్నాయి.
హైదరాబాద్ : సంక్రాంతి(Sankranthi )పండుగ నేపథ్యంలో పట్టణవాసులందరూ పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ, కర్నూల్, తమిళనాడు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా(Pantangi toll plaza) వద్ద వాహనాలు నెమ్మెదిగా కదులుతున్నాయి. ఏపీకి వెళ్లే వాహనాల కోసం ఎక్కువ టోల్బూత్లు ఏర్పాటు చేశారు. అయినా రద్దీ కొనసాగుతోంది. నిన్న ఏపీకి 60 వేల వాహనాలు వెళ్లాయని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు.
ఈ రోజు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. రద్దీ దృష్టిలో పెట్టుకొని టోల్ ప్లాజా వద్ద వాహనాలకు ఫాస్టాగ్ స్కాన్ వేగంగా చేసేలా టోల్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద నాలుగు హ్యాండ్ మిషన్లు, స్టిక్ మిషన్ ఏర్పాటు చేశారు. అలాగే పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రేన్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. విజయవాడ వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

