మక్తల్: లారీ, ఓల్వో బస్సు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున మక్తల్ పట్టణంలో ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మక్తల్ నల్లజానమ్మ ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై లారీ ( Lorry) డ్రైవర్ రోడ్డుపై లారీని నిలిపాడు. అదే సమయంలో కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఓల్వో బస్సు ( Volvo Bus ) క్రాసింగ్ వద్ద లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం మొత్తం డ్యామేజ్ అయిందని తెలిపారు.
బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బస్సు డ్రైవర్‌తో పాటు క్లీనర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయియ. ఇద్దరిని రాయచూర్ ఆసుపత్రికి తరలించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి వివరించారు.