నోయిడా: యూపీలోని నోయిడా హౌజింగ్ సొసైటీలో ఓ మహిళపై స్థానిక బీజేపీ కార్యకర్త అనుచితంగా వ్యవహించాడు. ఆమెను దూషించి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవాళ అధికారులు బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటి వద్ద ఉన్న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. బుల్డోజర్తో అక్రమ నిర్మాణ కట్టడాన్ని తొలగిస్తున్నారు. నోయిడా హౌజింగ్ సొసైటీకి బుల్డోజర్ రావడంతో.. అక్కడ ఉన్న స్థానికులు సంతోషంగా చప్పట్లు కొట్టారు. సీఎం యోగి నిర్ణయం పట్ల సంతోషంగా ఉందని స్థానికులు అన్నారు. నోయిడా సెక్టర్ 93బీలో నివసిస్తున్న ఓ మహళతో బీజేపీ నేత త్యాగి అనుచితంగా ప్రవర్తించాడు. ఆ ఘటనలో ఐపీసీ కింద కేసు బుక్కైంది. ప్రస్తుతం శ్రీకాంత్ త్యాగి పరారీలో ఉన్నాడు. త్యాగిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసు బుక్ చేశారు. శ్రీకాంత్ త్యాగి అక్రమంగా సొసైటీ పార్క్‌ను కబ్జా చేశాడు. దీంతో స్థానికులు ఆగ్రహానికి లోనయ్యారు. నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా.. అక్రమ నిర్మాణాన్ని చేపట్టాడు.