హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో గౌరవ వేతనం పేరిట వెట్టి చాకిరీ చేయిస్తున్నారని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి మండిపడ్డారు.
మంగళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఐసీడీఎస్ ప్రారంభమై 50 ఏండ్లు దాటినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవ వేతనం పెంచకపోగా.. శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.