Group-1 | హైదరాబాద్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహణలో విఫలమైందన నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు డిమాండ్ చేశారు. నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద శాంతియుత నిరసన చేస్తున్న తుంగ బాలుని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు అనంతరం తుంగ బాలు మాట్లాడుతూ.. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిహడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడడం వల్ల నీ నిర్లక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే సోయి కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు రేవంత్ రెడ్డి అని తుంగ బాలు చురకలంటించారు.
అభ్యర్థులకు 28 కేంద్రాల్లో సెంటర్లు కేటాయించగా కోటి ఉమెన్స్ కాలేజీలో మహిళ అభ్యర్థులకు ప్రతేకంగా రెండు సెంటర్లలో 71 మంది ఎంపికయ్యారు. మిగిలిన 26 సెంటర్లో 139 మంది ఎంపికయ్యారు ఇది ఎలా సాధ్యం? ముఖ్యంగా 563 ఉద్యోగాలలో కేవలం 9 శాతం మంది మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నట్లు టీజీపీఎస్సీ షీల్డ్ కవర్లో పేర్కొని, ఇంగ్లీష్‌లో 12,381 మంది పరీక్ష రాస్తే 508 మంది ఎంపికయ్యారు. తెలుగులో 8,694 మంది పరీక్ష రాస్తే కేవలం 56 మంది మాత్రమే ఎంపికయ్యారు. దీనివల్ల తెలుగు మీడియం చదివిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారని తుంగ బాలు పేర్కొన్నారు.
అభ్యర్థులు రీ కౌంటింగ్ అప్లికేషన్ చేసుకుంటే వాళ్లకు మార్కులు తగ్గాయని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ రోజు సమైక్య రాష్ట్రంలో నాటి కమీషన్ చైర్మన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని పోరాడినం, ఇప్పుడున్న కమీషన్ అదే విధానాన్ని అనుసరించటం వల్ల గ్రూప్-1 అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి గ్రూప్-1 పరీక్షలను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని తుంగ బాలు డిమాండ్ చేశారు.