అగ్రివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు
జయశంకర్ అగ్రివర్సిటీలో ఎప్‌సెట్, అగ్రి సెట్ సీట్ల కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు.
- బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): జయశంకర్ అగ్రివర్సిటీలో ఎప్‌సెట్, అగ్రి సెట్ సీట్ల కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. ఎప్‌సెట్ విద్యార్థులకు 85%, అగ్రిసెట్ విద్యార్థులకు 15% కేటాయించాల్సి ఉండగా 15% నుంచి 5 శాతానికి కుదించారని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 10% సీట్లు ఉంటే తెలంగాణ ఆవిర్భావం అనంతరం కేసీఆర్ సర్కార్ 15% కేటాయించిందని గుర్తుచేశారు.
కౌన్సెలింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ శనివారం యూనివర్సిటీ ఎదుట బీఆర్ఎస్వీ ఆందోళనకు దిగినట్టు పేర్కొన్నారు. కన్వీనర్ కోటా సీట్లు ఎకువ ఉంటాయని, స్పెషల్ కోటా సీట్లు తకువ ఉంటాయని, కానీ అగ్రికల్చర్ డిప్లొమా చేసిన విద్యార్థులపై వివక్షతో 25 సీట్లు రెగ్యులర్ కోటా, 50 సీట్లు స్పెషల్ కోటాలో కేటాయించడం అన్యాయమని మండిపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

