హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భూ కబ్జాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరిట సాగిస్తున్న మైనింగ్ దోపిడీపై సిట్టిం గ్ జడ్జితో విచారణ జరిపించాలని, వెంట నే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం గవర్నర్‌కు విజ్ఞప్తిచేసింది. సోమవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్ లోక్‌భవన్‌లో గవర్నర్ శివ్ప్రతా ప్ శుక్లాతో భేటీ అయ్యారు. మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి మైనింగ్ అక్రమాలు, భూకబ్జాలపై సాక్ష్యాధారాలను అందజేశారు. గంటకుపైగా సాగిన సమావేశంలో రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న అక్రమ వ్యవహారాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, తెలంగాణలో అచ్చంగా ఆనాటి ఎమర్జెన్సీ రోజులు తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా గవర్నర్ స్పందిస్తూ.. ఆనాటి ఇందిరాగాంధీ పాలన ఎమర్జెన్సీ రోజుల్లో 19 నెలలు జైలు శిక్ష అనుభవించానని గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్ఎల్పీ నాయకులు స్పందిస్తూ దురదృష్టవశాత్తు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే మై నింగ్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించి, జంట జలాశయాల పరిధిలో నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా మైనింగ్ చేస్తున్నదని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మినరల్ డీలర్ లైసెన్స్, పొల్యూషన్ బోర్డు, పరిశ్రమల శాఖ పర్మిషన్లు, విద్యుత్తు కనెక్షన్లు లేకుండా రెండేండ్లుగా వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నదని ఆధారాలతో కూడిన విజ్ఞానపపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు.
గవర్నర్‌ను కలిసిన వారిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్లు హరీశ్‌రావు, తలసాని, సబిత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గంగుల, వేము ల, మల్లారెడ్డి, కోవ లక్ష్మి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వివేకానందగౌడ్, రాజశేఖర్‌రెడ్డి, అనిల్‌జాదవ్, విజయుడు, కౌశిక్‌రెడ్డి, సంజయ్, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కృష్ణారావు, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీలు రమణ, వాణీదేవి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, శంభీర్‌పూర్ రాజు తదితరులు ఉన్నారు.