సోన్, ఏప్రిల్ 21: బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, వచ్చేది మన ప్రభుత్వమేనని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా కష్టపడాలని నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సోన్ మండల కన్వీనర్‌గా జాఫ్రాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అండెడి సాయారెడ్డిని నియమించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నిర్మల్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, సోన్ మాజీ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, నిర్మల్, మామడ, లక్ష్మణచాంద మండలాల కన్వీనర్లు మహేశ్‌రెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు భూషన్‌రెడ్డి, జీవన్‌రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, గాంధీనగర్ సర్పంచ్ బస్వరాజు, బీఆర్ఎస్ నాయకులు కిరణ్‌రావు పాల్గొన్నారు.
జైనథ్ మార్కెట్ యార్డులో శనగ కొనుగోళ్లను ప్రారంభించిన అధికారులు మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం ఆరు పంచాయతీలకు చెందిన శనగ పంటను కొనుగోలు చేశారు. మండలాల్లో 12,400 ఎకరాల్లో 1.10 లక్షల క్వింటాళ్ల దిగుబడి రాగా.. 24 వేల క్వింటాళ్ల మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. కోటా పూర్తయిందనే సాకుతో 80 వేల క్వింటాళ్ల పంటను కొనుగోలు చేయడం లేదు. పంట కొనుగోలు చేయాలని ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చిన స్పందన లేదు. అధికారులు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ఏప్రిల్ 30 వరకు పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయాలి.
– లింగారెడ్డి, రైతు నాయకుడు, జైనథ్