ఊట్కూర్, ఏప్రిల్ 21 : మక్తల్-నారాయణపేట డ బుల్ రోడ్డు మరమ్మతుకు గ్రహణం పట్టింది. నిత్యం వాహనాల రద్దీ ఉండే ఈ రోడ్డు పూర్తిగా గుం తలమయంగా మారింది. రాళ్లు, రప్పలు, దుమ్ము ధూళి తో రోడ్డుపైకి రావాలంటేనే వాహనదారులు, ప్రయాణికులు జంకుతున్నారు. మోకాల్లోతు గుంతలున్న ఈ రోడ్డులో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కా ంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేండ్లు కావస్తున్నా మరమ్మతులపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో నాటి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సింగిల్ లేన్‌గా ఉన్న ఆర్అండ్బీ రోడ్డును పేట వ యా ఊట్కూర్ మీదుగా మక్తల్ వరకు 25 కి.మీ. వరకు డబుల్ రోడ్డుగా మార్చారు. కర్ణాటకలోని శక్తినగర్ నుంచి తాండూర్, కొడంగల్ ప్రాంతాల్లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలకు అధిక లోడ్‌తో బూడిద లారీలు, టిప్పర్లు రాకపోకలు సాగించడం తో రోడ్డు దెబ్బతిన్నది. దీనికి తోడు ఇసుక, కంకర టిప్పర్లు తిరగటంతో గుంతలమయంగా మారి తారు పోయింది.
అడుగడుగునా గుంతలు
పేట జిల్లాలోని పలు మండలాలతోపాటు కర్ణాటక సరిహద్దు గ్రామాలు, కొడంగల్, కోస్గి గ్రామాల ప్ర యాణికులు రాయిచూర్, మంత్రాలయం, గద్వా ల, కర్నూల్, బెంగళూర్ తదితర ప్రాంతాలతోపాటు జూరాల ప్రాజెక్టు వద్దకు సందర్శకులు ఇదే రోడ్డున వెళ్తుంటారు. మరో పక్క ఊట్కూర్, మక్తల్, మాగనూర్, నర్వ, కృష్ణ మండలాల ప్రజలు, అధికారులు ఉద్యోగ రీత్యా, వివిధ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి, జిల్లా దవాఖానకు చేరుకోవాలన్నా.. ఈ రోడ్డు మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే అడుగడుగునా గుంతలు ఏర్పడి అధ్వాన్నంగా మారడంతో దవాఖానకు వెళ్లే మార్గమధ్యంలోనే గర్భిణులకు ప్రసవం జరిగిన సంఘటనలు కూడా ఉ న్నాయి. భారీ వర్షం కురిస్తే ఈ రోడ్డుపై బైక్‌లు ము ందుకు కూడా కదల్లేవు. రాత్రిళ్లు గుంతలను తప్పించబోయి ప్రమాదాలకు గురవుతున్నారు.
హామీ నీటి మూటలేనా..?
సింగారం క్రాస్ రోడ్డు నుంచి మక్తల్ వరకు ఉన్న డబుల్ రోడ్డును నాలుగు లేన్లుగా మార్చనున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఇటీవల మక్తల్‌లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మక్తల్-పేట రోడ్డును నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.157 కోట్ల బడ్జెట్‌తో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రకటించి నా నేటికీ అధికారు లు పనులు మొద లు పెట్టలేదు. కనీసం తాత్కాలిక మరమ్మతులను సైతం చేపట్టకపోవడంతో ప్రయాణికు లు ప్రమాదాల బారిన ప డుతున్నారు. రేవంత్ స ర్కార్ నిర్లక్ష్యంపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.
వేగంగా చేపట్టాలి
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా రోడ్ల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. పేట-మక్తల్ వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి సీఎం స్వయంగా శంకుస్థాపన చేసినా నేటికీ పనులు మాత్రం మొదలు కాలేదు. ఇదే కాకుండా నియోజవర్గంలో చాలా రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏ రోడ్డు చూసినా గుంతలమయంగా మారింది. మంత్రి శ్రీహరి దృష్టి సారించడంతోపాటు నాలుగులేన్ల పనులు చేపట్టాలి.
– మహేశ్‌గౌడ్, బిజ్వారం గ్రామం