Rose Petals: విఠలేశ్వరుడి భక్తులపై వెయ్యి కిలోల గులాబీ పువ్వులు..
Rose Petals : విఠలేశ్వరుడి భక్తులపై గులాబీ పువ్వుల రేకులను చల్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ వేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పండరీపుర్ వెళ్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆషాడ ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తులపై ఆ పువ్వుల రేకులను చల్లాలని భావించారు. అయితే ఇప్పటి వరకు మహారాష్ట్ర సర్కార్ అనుమతి ఇవ్వలేదు.
సోలాపూర్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సోలాపూర్ వెళ్తున్న విషయం తెలిసిందే. రేపు ఆయన పండరీపుర్లోని విఠలేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. అత్యంత పవిత్ర క్షేత్రమైన ఆ ప్రాంతంలో తెలంగాణ తన ప్రత్యేక ప్రభావాన్ని చూపనున్నది. అయితే ఆషాడ ఏకాదశి పండుగ వేళ భారీ సంఖ్యలో విఠలేశ్వరుడి దర్శనం కోసం భక్తులు రానున్నారు. ఆ భక్తులపై పూల వర్షం కురిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులపై సుమారు వెయ్యి కిలోల గులాబీ పువ్వుల రేకులను(Rose Petals) చల్లేందుకు ప్రణాళిక వేసినట్లు ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.
BRS President, CM Sri KCR left for Solapur in Maharashtra by road from Hyderabad today. pic.twitter.com/LpFZ2k5m3c
— BRS Party (@BRSparty) June 26, 2023
టీన్యూస్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. మూడు హెలికాప్టర్ల ద్వారా పువ్వులు చల్లేందుకు ప్లాన్ వేసినట్లు చెప్పారు. అయితే స్థానిక ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. సోలాపూర్‌లో బీఆర్ఎస్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే బాలస్క సుమన్ పరిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరాఠీలు కోరుకుంటున్నట్లు సుమన్ తెలిపారు. తెలంగాణ మోడల్‌ను మహారాష్ట్రలో అమలు చేస్తామని ఆయన అన్నారు. బీఆర్ఎస్కు మరాఠీల నుంచి భారీ మద్దతు దక్కుతుందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BRS
- CM KCR
- Pandharpur
- rose petals
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

