హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నద ని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందు లో భాగంగానే ఆయనకు 20 ఏండ్లుగా ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని తొలగించిందని పేర్కొన్నాయి. హోంమంత్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో ఆర్ఎస్పీ బీఎస్పీలో ఉన్నప్పుడు కూడా నాటి కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చింది. పోలీసు శాఖకు ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని భద్రతా సిబ్బందిని నియమించా రు. ఆర్ఎస్పీ తన 26 ఏండ్ల ఐపీఎస్ కెరీర్లో దాదాపు 12 నుంచి 15 ఏండ్లు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే పనిచేశారు. ఆయనకు నక్సలైట్ల నుంచి ఫ్యాక్షనిస్టుల వరకూ తీవ్రమైన ముప్పు ఉన్న నేపథ్యంలో గత 20 ఏండ్లుగా బుల్లెట్ ప్రూఫ్ కారునే వాడుతున్నారు.
బుల్లెట్‌ప్రూఫ్ వాహనం తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన ప్రవీణ్‌కుమార్‌కు అక్కడ ఊరట లభించింది. ప్రభుత్వం రివ్యూకమిటీలు, ఇం టెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకొని, ఆ తర్వాతతే భద్రత తొలగించామని కోర్టుకు వివరించి, ఈ నెల 27నుంచి బుల్లెట్‌ప్రూఫ్ కారును వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో త్వరలోనే గన్మెన్లను సైతం వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్ర భుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల.. ప్రవీణ్‌కుమార్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఎం సోదరులకు అనధికారికంగా భద్రత, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నారనే విమర్శలు జోరందుకున్నాయి.