BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి, బొడుప్పల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్తోపాటు ఇతర పార్టీ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ డివిజన్లోని మార్కెట్ రోడ్డులో 100 మీటర్ల ఫ్లెక్సీతో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మరోవైపు గజ్వేల్ పట్టణంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్
కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిరసన చేసిన మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ నేతలు
మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి, బొడుప్పల్ ప్రాంతాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే… https://t.co/efVIxp6ZCx pic.twitter.com/8RupLUGF6v
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026