న్యూయార్క్: ఇరాన్‌కు రష్యా సీక్రెట్‌గా సహకరిస్తున్నది. సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్ల(Supersonic Cruise Missiles)ను డెవలప్ చేసేందుకు ఇరాన్‌కు రష్యా సహకరిస్తున్నట్లు తెలిసింది. సీ430ఎల్ పేరుతో ఆ మిషన్ చేపట్టారు. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా యుద్ధనౌకలను ఎదుర్కొనే రీతిలో ఆ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నారు. రష్యన్ ఇంటెలిజెన్స్ నుంచి లీకైన సమాచారం ఆధారంగా ఈ అంచనా వేస్తున్నారు. 2023లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ య్యింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఆ ప్రోగ్రామ్ ప్రారంభమైనట్లు తెలిసింది.
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా రామ్‌జెట్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను డెవలప్ చేస్తున్నారు. ధ్వని వేగం కన్నా అధిక వేగంతో వెళ్లే క్రూయిజ్ క్షిపణులకు చెందిన ఇంజిన్లను ఈ టెక్నాలజీతో తయారు చేయవచ్చు. చాలా సున్నితమైన, వ్యూహాత్మక మిలిటరీ టెక్నాలజీని రష్యా బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అత్యున్నత స్థాయి రాజకీయ క్లియరెన్స్ లేకుండా ఈ ప్రోగ్రామ్‌ను చేపట్టడం సాధ్యం కాదు, అంటే దీనికి దేశాధ్యక్షుడి అనుమతి ఉండి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇరాన్ స్వయంగా రామ్‌జెట్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను డెవలప్ చేసి, క్షిపణులను నిర్మించినట్లు ఓ రిపోర్టు ద్వారా వెల్లడైంది. ఆ టెక్నాలజీ రష్యా ఏమీ ఇవ్వలేదని అంటున్నారు. ఒకవేళ రామ్‌జెట్ టెక్నాలజీ ఇరాన్ వద్ద ఉంటే, అప్పుడు అమెరికా నౌకలకు ఇబ్బంది తప్పదని మిలిటరీ విశ్లేషకుడు జిమ్ లామ్సన్ తెలిపారు. అయితే రష్యాకు చెందిన ఆయుధ కంపెనీ రోసోబోరన్ఎక్స్పోర్ట్ సీ430ఎల్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిసింది. రష్యా రాకెట్ డిజైన్ బ్యూరో ఎన్పీవో మషినోస్ట్రోయేనియా కూడా ఈ ప్రాజెక్టుకు సహకరించింది.