పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97తో పాటు విద్యారంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత విధానాలపై చర్చకై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్కు ఎమ్మెల్సీ ఎల్.రమణ వాయిదా తీర్మానం అందజేశారు.