హైదరాబాద్ : బీఆర్ఎస్ మలేషియా ( BRS Malaysia ) ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల( Mahesh Bigala ) ఆధ్వర్యంలో మారుతి కుర్మా, చిట్టిబాబు, శ్రీధర్, ప్రియా తదితరులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) ను కలిసి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు
.ఈ ఆహ్వానాన్ని కేటీఆర్ స్వీకరించి, జూన్ 6న మలేషియాలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్నట్లు ధృవీకరించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ , మాజీ ఎమ్మెల్యే జి. కిషోర్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ మరియు తెలుగు ప్రజలను ఒక వేదికపైకి తీసుకువచ్చి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ మలేషియా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.