మియాపూర్ భూములు అమ్మొద్దు
‘ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లు కష్టపడి కాపాడిన మియాపూర్ భూములను కమీషన్ల కోసం రేవంత్ సర్కార్ కారు చౌకగా అమ్మాలని చూస్తున్నది. ఆ భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దు. ఒకవేళ ఆ భూములను అమ్మితే బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సమగ్ర విచారణ జరిపిస్తాం’ అని బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద స్పష్టంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
- ఒకవేళ అమ్మితే బీఆర్ఎస్ అధికారంలోకి
- రాగానే సమగ్ర విచారణ జరిపిస్తాం
- 25 శాతం కమీషన్ల కోసమే భూముల సేల్
- బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద
- రేవంత్ అక్రమాలన్నింటినీ బయటకు తీస్తాం
- ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లు కష్టపడి కాపాడిన మియాపూర్ భూములను కమీషన్ల కోసం రేవంత్ సర్కార్ కారు చౌకగా అమ్మాలని చూస్తున్నది. ఆ భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దు. ఒకవేళ ఆ భూములను అమ్మితే బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సమగ్ర విచారణ జరిపిస్తాం’ అని బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద స్పష్టంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లు కొట్లాడకపోతే మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు నుంచి సానుకూల తీర్పు వచ్చేదా? అని ప్రశ్నించారు. రూ.లక్షన్నర కోట్ల విలువైన ఆ భూములను తానే కాపాడనని సీఎం రేవంత్‌రెడ్డి తుపాకీ రాముడి ముచ్చట్లు చెప్పుకుంటున్నారని చురకలు అంటించారు. మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు కాపీలు రాకముందే సీఎం హడావుడిగా ఆ భూములు అమ్ముతామని ప్రకటించారని తెలిపారు. ముఖ్యమంత్రి ముందే ఆ భూములకు అడ్వాన్స్ తీసుకున్నారా? అనే అనుమానం కలుగుతున్నదని ఆరోపించారు.
1994లో రంగులు వేసుకునే రేవంత్‌రెడ్డి ఇప్పుడు మియాపూర్ భూముల గురించి తానే పోరాడానని చెప్పుకోవడం ఏంది? అని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ హయాంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు వేసిన విత్తనాలకు నేడు ఫలితాలు దక్కుతున్నాయని గుర్తుచేశారు. కబ్జాలు, బ్లాక్‌మెయిల్‌కు రేవంత్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసని పేర్కొన్నారు. సీఎం సీటులో కూర్చొని ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డికి భూముల అమ్మకం తప్ప పాలన తెలియదు అని చురకలు అంటించారు. రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం లేదని, కేవలం తన కుటుంబం కోసమే పనిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. గతంలో మెట్రో భూములను కాజేయాలని కుట్ర చేశారని, హిల్ట్ పాలసీతో భూదందాకు తెరలేపారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి పరిపాలన చేస్తానని రేవంత్‌రెడ్డి చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి 25 శాతం కమీషన్లు తీసుకుని భూములను తెగనమ్ముతున్నారని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి అక్రమాలన్నీ బయటకు తీస్తాం: కల్వకుంట్ల సంజయ్
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి అక్రమాలన్నింటినీ బయటకు తీస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హెచ్చరించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ కంటే తానే గొప్ప అని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, అబద్ధాలు చెప్పడంలో, కుటుంబ సభ్యులకు భూములను అప్పనంగా కట్టబెట్టడంలో రేవంత్ గొప్పోడేనని దెప్పి పొడిచారు. కేబీఆర్ పార్క్ చుట్టూ తవ్వకాలు చేపట్టి అర్ధంతరంగా పనులు బంద్ చేశారని, దీంతో రేవంత్‌ను చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మియాపూర్ భూముల కోసం లాయర్లను పెట్టి కొట్లాడారని, ఇప్పుడు తీర్పు రాగానే రేవంత్‌రెడ్డి తన ఖాతాలో వేసుకోవాలని చూడటమేంది? అని ప్రశ్నించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BRS
- KTR
- Miyapur lands
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

