20 ఫీట్ల ఫేసింగ్కు పర్మిషన్ ఇవ్వండి
20 ఫీట్ల వెడల్పు ఫేసింగ్ ఉంటే ప్లాట్లకు భవన నిర్మాణ అనుమతులు నిరాకరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్‌ను కలిసింది.
- రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్
సిటీబ్యూరో, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ) : 20 ఫీట్ల వెడల్పు ఫేసింగ్ ఉంటే ప్లాట్లకు భవన నిర్మాణ అనుమతులు నిరాకరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్‌ను కలిసింది. ఈ మేరకు 20ఫీట్ల ఫేసింగ్ అంశానికి అడ్డంకిగా ఉన్న జీవో నం. 168పై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు. వినతిపత్రం అందజేసిన రియల్టర్లు పలు అంశాలను ప్రస్తావించారు. 6 మీటర్ల కంటే ప్లాట్ ఫేసింగ్ తక్కువ ఉంటే బిల్డ్ నౌలో అనుమతులు రావడం లేదని, దీంతో ఎంతోమంది పేద, మధ్యతరగతి జనాలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్లాట్ ఫేసింగ్ 18 ఫీట్ల కంటే తక్కువ ఉంటే అనుమతులు రాకపోవడంతో సొంతింటి కల కనుమరుగైతున్నదన్నారు. 100 గజాల లోపు ఉంటే ప్లాట్లపై ఈ ప్రభావం ఎక్కువ పడుతుందని, శివారు ప్రాంతాల్లో లక్షలాది ప్లాట్లు 18 ఫీట్ల కంటే తక్కువ వెడల్పుతోనే ఉంటాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. అనుమతులకు అడ్డంకిగా మారిన జీవో నం. 168పై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి, తక్షణమే అనుమతులు వచ్చే విధంగా నిబంధనలు మార్పులు చేయాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

