ఏపీలో సంబురాలు తెలంగాణలో క్రాప్హాలిడేలా?
కృష్ణా నదికి భారీ వరద వస్తే ఆంధ్రప్రదేశ్‌లో జలహారతులు పడుతుండగా, పాలమూరు జిల్లాలో మాత్రం క్రాప్ హాలిడేలు ప్రకటించి సొంత జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
- కృష్ణా, గోదావరి జలాలను బాబుకు దోచిపెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
- పాలమూరుకు ద్రోహం .. మళ్లీ పాత రోజులు తెచ్చిన కాంగ్రెస్
- మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
- కల్వకుర్తి లింక్ కెనాల్ ద్వారా కందూరు వాగులోకృష్ణా జలాలను పారించాలని ఆల పాదయాత్ర
మహబూబ్‌నగర్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణా నదికి భారీ వరద వస్తే ఆంధ్రప్రదేశ్‌లో జలహారతులు పడుతుండగా, పాలమూరు జిల్లాలో మాత్రం క్రాప్ హాలిడేలు ప్రకటించి సొంత జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట, అడ్డాకుల మండలాల్లో ప్రవహించే పెద్దవాగులో కృష్ణా జలాలను పారించాలని డిమాండ్ చేస్తూ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవారం పాదయాత్ర చేశారు. నిజాలాపూర్ నుంచి కందూరు వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సంఘీభావం తెలిపి ఆయనతోపాటు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ కృష్ణా నీళ్లను ఏపీకి దోచిపెట్టిందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు మూడేండ్లుగా పెండింగ్‌లో పెట్టారని మండిపడ్డారు. కృష్ణా నీళ్లు వస్తే ఏపీ ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని చెప్పారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో మాత్రం కృష్ణా నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు తుంగభద్ర జలాల్లో దోపిడీ జరుగుతున్నదని, ఏపీ, కర్ణాటక ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు రానివ్వడం లేదని ఆరోపించారు. సొంత జిల్లాకు అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృషితో పెద్దవాగు జలకళను సంతరించుకున్నదని, కానీ కాంగ్రెస్ రాగానే వాగు ఎండిపోయిందని విమర్శించారు.
శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తిపోయలేని ప్రభుత్వం : ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
పాలమూరు జిల్లా పరీవాహక ప్రాంతంగా ఉన్న శ్రీశైలంలో నీళ్లు ఉన్నా ఎత్తిపోయలేని అసమర్థ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్తు సరఫరా లేక కల్వకుర్తి మోటర్లను నడుపడం లేదని పేర్కొన్నారు. కరువు పరిస్థితుల్లో కృష్ణా నీళ్లను ఒడిసి పట్టకుండా కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. ఏపీ రాష్ట్రం కృష్ణా నీళ్లను 700 కిలోమీటర్ల దూరం వరకు తరలించుకొని పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నదని దయ్యబట్టారు. మన జిల్లా నుంచి కృష్ణా నది పారుతున్నది, అయినప్పటికీ మన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని దుయ్యబట్టారు. 2014 కంటే ముందు పెద్దవాగు పూర్తిగా ఎండిపోయిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా నీళ్లను పెద్దవాగులో పారించామని, యుద్ధప్రాతిపదికన పనులు చేసి పెద్దవాగుకు జీవం పోశామని వివరించారు. పదేండ్లపాటు వాగు కళకళలాడిందని చెప్పారు. మార్చి వరకు చెక్‌డ్యామ్‌ల్లో నీళ్లు ఉండేవని గుర్తుచేశారు. తాము 36 చెక్‌డ్యామ్‌లు కడితే రెండు కిలోమీటర్ల మేర బోర్లు రీచార్జ్ అయ్యాయని, వేలాది ఎకరాలు సస్యశ్యామలం అయ్యాయని వివరించారు. ప్రస్తుత ఎమ్మెల్యేకు పెద్దవాగులోకి నీళ్లు ఎట్లా వస్తాయో తెల్వదని, పెద్దవాగు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. పెద్దవాగును ఎండబెట్టి ఇసుక దోపిడీకి తెరలేపారని ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

