నల్లగొండ : సాయి ఈశ్వరాచారి మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వ అలసత్వానికి బలైన ఈశ్వరాచారి చిత్రపటానికి నల్లగొండ పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించకుండానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థలకు వెళ్లడం నయన వంచనకు పరాకాష్ట అన్నారు. పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు బీసీలకు ఎలాంటి మేలు చేయవన్నారు. ఈ బలిదానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడి బీసీ రిజర్వేషన్స్ కోసం పాటుపడాలన్నారు. లేదంటే ఈశ్వరాచారి స్ఫూర్తితో ఉద్యమిస్తామని హెచ్చరించారు.