గద్వాల, సెప్టెంబర్ 25 : బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి, పార్టీ ఫిరాయించడంతోపాటు కోర్టు, స్పీకర్, నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గురువారం జోగుళాంబ గద్వాలలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్‌కుమార్ ఎస్పీ శ్రీనివాస్‌రావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి కండువా కప్పుకొన్నా.. తాను పార్టీ మారలేదని అబద్ధాలు చెప్పడం సరికాదని విమర్శించారు.
అనుమతి లేకుండా కాంగ్రెస్ నాయకులు తన ఫొటోలను ఫ్లెక్సీలో వేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి విశ్వనాథన్ పర్యటనలో తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారని, కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయాలని ఎందుకు కోరారని ప్రశ్నించారు. తనను గెలిపించిన జనానికి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.