ఖైరతాబాద్ : కాంగ్రెస్ పార్టీ దివంగత నాయకుడు పీజేఆర్ నిఖార్సైన మాస్ లీడర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పీజేఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఖైరతాబాద్ చౌరస్తాలోని పీజేఆర్ విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు పీజేఆర్ చేసిన సేవలను కొనియాడారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి పీజేఆర్ చేసిన కృషి చిరస్మరణీయమని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగర రాజకీయాల్లో 50 ఏళ్లపాటు చెరగని ముద్రవేసిన ధీశాలి పీజేఆర్ అని ఆయన కొనియాడారు. నాడు సమైక్య పాలనలో హైదరాబాద్ మహానగరానికి మంచి నీళ్లు అందించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నగర ప్రజల తరఫున పోరాడిన నాయకుడు పీజేఆర్ అని చెప్పారు.
పీజేఆర్ ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసమే పాటుపడే వారని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన తెలంగాణ అభివృద్ధిని చూసి ఉంటే.. పీజేఆర్ గుండెలనిండా సంతోష నిండిపోయేదేమోనని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, పీజేఆర్ కుమారుడు పీ విష్ణువర్ధన్ రెడ్డి కూడా కేటీఆర్‌తో ఉన్నారు.
హైదరాబాద్ నగరాభివృద్ధికి, పేదల సంక్షేమానికి పీజేఆర్ గారు చేసిన కృషి చిరస్మరణీయం
హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత యాభై ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ధీశాలి, నిఖార్సైన మాస్ లీడర్ పి. జనార్ధన్ రెడ్డి గారు.
ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ గారి 18వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల… https://t.co/iM2fxpUaVl pic.twitter.com/rCb8RTjuyp
— KTR News (@KTR_News) December 28, 2025