మియాపూర్ భూములు అమరవీరుల కుటుంబాలకివ్వాలి
సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిలో శ్రీకాంతాచారి పేరుతో కాలనీ ఏర్పాటుచేసి అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇవ్వాలని బీఆర్ఎస్ నేత డీ రాజారామ్‌యాదవ్ డిమాండ్ చేశారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో వందలాది ఎకరాలు ఉన్నాయని, అందులో ప్రభుత్వ భూమి ఉన్నదని, దానిని అమరవీరుల కుటుంబాలకు కేటాయిస్తామని చెప్పారని గుర్తుచేశారు.
- బీఆర్ఎస్ నాయకుడు రాజారామ్‌యాదవ్
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిలో శ్రీకాంతాచారి పేరుతో కాలనీ ఏర్పాటుచేసి అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇవ్వాలని బీఆర్ఎస్ నేత డీ రాజారామ్‌యాదవ్ డిమాండ్ చేశారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో వందలాది ఎకరాలు ఉన్నాయని, అందులో ప్రభుత్వ భూమి ఉన్నదని, దానిని అమరవీరుల కుటుంబాలకు కేటాయిస్తామని చెప్పారని గుర్తుచేశారు. కానీ దళితులకి, అమరవీరుల కుటుంబాలకు మధ్య పంచాయితీ పెట్టడమే రేవంత్ రాజకీయమని విమర్శించారు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అవిశ్రాంతం గా, కోర్టులో బలమైన వాదనలను వినిపించిన నేపథ్యంలోనే ప్రస్తుతం మియాపూర్ భూములు ప్రభుత్వపరమైనదని, అందులో రేవంత్ చేసిందేమీ లేదన్నారు. కోర్ సిటీలో 7 లక్షల ఎకరాలు అందుబాటులో ఉన్నా, గజ్వేల్ అడవుల్లో ఇండ్ల స్థలాలు ఇస్తామనడం అవమానించడమేనని మండిపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

