‘బ్లాస్టింగ్’ కంపెనీపై చర్యలు తీసుకోవాలి
మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టకు కేవలం రెండు వందల మీటర్ల లోపు ఎలాంటి అనుమతులు లేకుండా రెండు నెలలుగా రాత్రీపగలు పెద్ద ఎత్తున బ్లాస్టింగులు నిర్వహిస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు.
-
మల్లన్నసాగర్ కట్ట వద్ద పేలుళ్లు సరికాదు
-
కుకునూరుపల్లి ఠాణాలో బీఆర్ఎస్ నేత వంటేరు ఫిర్యాదు
సిద్దిపేట, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టకు కేవలం రెండు వందల మీటర్ల లోపు ఎలాంటి అనుమతులు లేకుండా రెండు నెలలుగా రాత్రీపగలు పెద్ద ఎత్తున బ్లాస్టింగులు నిర్వహిస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కుకునూరుపల్లి ఎస్సైకి ఫిర్యాదు చేశారు. అనంతరం వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణకు వరప్రదాయినిగా నిలిచిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ 50 టీఎంసీల సామర్థ్యంతో దాదాపు 16.23 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటు హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జనగామ, సిరిసిల్ల తదితర జిల్లాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న అత్యంత కీలకమైన జలవనరు అని పేర్కొన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టకు కేవలం 200 మీటర్ల దూరంలో హైదరాబాద్ మూసీ నది సుందరీకరణకు నీటిని తరలించేందుకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వాటర్ పంప్‌హౌస్ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. ఇరిగేషన్ శాఖ నిబంధనల మేరకు కట్టకు 400 మీటర్ల వరకు ఎలాంటి బ్లాస్టింగ్ చేయరాదని పేర్కొన్నారు. అన్ని రకాల బ్లాస్టింగులు, తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

