Veenavanka | వీణవంక, డిసెంబర్ 19: పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజ్జెల మొగిలయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందగా కిష్టంపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి అత్యల్ప మెజార్టీతో గెలుపొందారు. స్థానిక సంస్థల మూడవ దశ ఎన్నికల్లో భాగంగా మండలంలో మొత్తం 26 గ్రామాలు ఉండగా ఒకటి ఏకగ్రీవమైంది. కాగా మిగతా 25 గ్రామాలకు పోలింగ్ జరిగింది. వీటిలో మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో 1987 ఓట్లు ఉండగా 1758 ఓట్లు పోలయ్యాయి.
బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజ్జెల మొగిలయ్య సమీప బీజేపీ అభ్యర్థిపై 459 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కిష్టంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అప్పాల తిరుమల సమీప బీఆర్ఎస్ అభ్యర్థి 9 ఓట్ల అత్యల్ప మెజార్టీతో గెలుపొందారు. తన విజయానికి కృషి చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డికి గజ్జెల మొగిలయ్య కృతజ్ఞతలు తెలిపారు.