హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ‘జై తెలంగాణ, జై కేసీఆర్’ నినాదాల మధ్య కేట్ కట్ చేసి వేడుకలను జరుపుకొన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని తెలిపారు.
ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే ఉ న్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు హరిగౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి రేటినేని, ఐడ్వెజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేశ్ కుప్పాల, కార్యదర్శి (ఐటీ, మీడియా) రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.