మెడికల్ విద్యార్థులకు అండగా ఉంటాం..
మహేశ్వరం మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు బీఆర్ఎస్పార్టీ అండగా ఉంటుందని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విద్యార్థులకు హామీ ఇచ్చారు. బుధవారం మంగల్‌పల్లి సమీపంలో కొనసాగుతున్న మహేశ్వరం మెడికల్ కళాశాల విద్యార్థుల ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు.
- మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి హామీ
- అన్ని సౌకర్యాలు కల్పించాలని మంచిరెడ్డి డిమాండ్
రంగారెడ్డి, నవంబర్ 4 (నమస్తేతెలంగాణ) : మహేశ్వరం మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు బీఆర్ఎస్పార్టీ అండగా ఉంటుందని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విద్యార్థులకు హామీ ఇచ్చారు. బుధవారం మంగల్‌పల్లి సమీపంలో కొనసాగుతున్న మహేశ్వరం మెడికల్ కళాశాల విద్యార్థుల ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు. విద్యార్థులతో పాటు ఆయన ధర్నాలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
రంగారెడ్డిజిల్లా కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కళాశాలను మంజూరు చేసిందని, మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి నాలుగువందల పడకల ఆస్పత్రి నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.182కోట్ల నిధులు మంజూరు చేసిందని, అలాగే, మీర్ఖాన్పేట్ వద్ద 25ఎకరాల భూమిని కూడా కేటాయించిందని అన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి తాను, సబితాఇంద్రారెడ్డి కలిసి శంకుస్థాపన చేశామని ఆయన అన్నారు. కళాశాల నిర్మాణం పూర్తయితే కేసీఆర్‌కు సబితాఇంద్రారెడ్డికి పేరొస్తుందనే అక్కస్సుతో మెడికల్ కళాశాల నిర్మాణాన్ని నిలిపివేశారని అన్నారు. మెడికల్ కళాశాల నిర్వాహణ కోసం మంగల్‌పల్లి సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని గత మూడేళ్లుగా అందులో నిర్వహిస్తున్నారని అన్నారు.
ఈ భవనం పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా ఉందని, ఇక్కడ సరైన ల్యాబ్, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని ఆయన అన్నారు. మంగల్‌పల్లి గేటు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెడికల్ కళాశాలకు కాలినడకన వస్తున్నారని ఆయన అన్నారు. మెడికల్ కళాశాల మంజూరుతో పాటే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించాలని తాము ఆదేశించామని ఆయన అన్నారు. కాని, ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి బస్సు సౌకర్యం లేదని, హాస్టల్ వసతితో పాటు తాగటానికి నీరు కూడా సరిగ్గా లేవని విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. మహేశ్వరం మెడికల్ కళాశాల నిర్వహిస్తున్న గదిలో కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులకు తాగునీరు,. విద్యుత్, మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

కళాశాలలో అన్ని వసతులు కల్పించాలి
మహేశ్వరం మెడికల్ కళాశాల సొంత భవనం నిర్మించలేని ప్రభుత్వం వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయటం సమంజసం కాదన్నారు. వెంటనే ప్రస్తుతం కొనసాగుతున్న భవనంలో అన్ని సౌకర్యాలు కల్పించటంతో పాటు విద్యార్థులు హాస్టల్, బస్సు సౌకర్యం రెండు నెలల్లోపు కల్పించాలని, అలాగే, వెంటనే వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి సమీపంలో మరో భవనంలోకి మెడికల్ కళాశాలను మార్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహేశ్వరం మెడికల్ కళాశాలను మంగల్‌పల్లి సమీపంలో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తుండగా ప్రాక్టికల్స్ మాత్రం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో చేస్తున్నారని, ఈ రెండు కళాశాలల మధ్య 22కిలోమీటర్ల దూరం ఉందని అన్నారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి నుంచి మంగల్పల్లికి రావటానికి రెండు బస్సులు మారాల్సి వస్తుందని, ఈ లోగా ఉన్న సమయం సరిపోవటం లేదని అన్నారు.
మరోవైపు మంగల్ఫల్లి గేటు నుంచి కళాశాల వరకు సుమారు మూడు కిలోమీటర్లు దూరం ఉందని, కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వెంటనే వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి సమీపంలో అన్ని వసతులతో కూడిన భవనంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయటానికి జిల్లా కలెక్టర్ చొరువ తీసుకోవాలని ఆయన అన్నారు. లేని పక్షంలో బీఆర్ఎస్పార్టీ విద్యార్థులతో కలిసి పోరాటాన్ని తీవ్రరం చేస్తామని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్, నాపై కోపంతోనే మెడికల్ కళాశాలనునిర్మించటంలేదు : సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి
మహేశ్వరం మెడికల్ కళాశాలను మీర్ఖాన్పేట్ వద్ద నిర్మిస్తే కేసీఆర్, నాకు మంచిపేరు వస్తుందని ఒకే ఒక్క కారణం చేత ఇక్కడ మెడికల్ కళాశాలను నిర్మించటం లేదని మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైతే దానిని మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటుకు కేసీఆర్ హామీ ఇవ్వటం తనకెంతో సంతోషాన్నిచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంతోషాన్ని కాలరాసిందని అన్నారు. 182కోట్లతో 25ఎకరాల్లో మీర్ఖాన్పేట్ వద్ద మెడికల్ కళాశాలతో పాటు 400పడకల ఆస్పత్రి నిర్మాణంకు నిధులు కేటాయిస్తే ఇప్పటి వరకు భవనం నిర్మాణానికి నోచుకోలేదని ఆమె అన్నారు.
ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరితోనే మహేశ్వరం మెడికల్ కళాశాలను నిర్మించకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. తమపై ఉన్న అక్కసుతో సుమారు 150మంది మహేశ్వరం మెడికల్ కళాశాలలో విద్యనభ్యసించే వైద్య విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మహేశ్వరం మెడికల్ కళాశాలలో వైద్యవిద్యార్థులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని సబితాఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

