భరోసా జమపై సర్కార్ డ్రామా!
రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయ్యాయంటూ సెల్ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లతో అన్నదాతలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. తెలంగాణ ప్రభు త్వం బ్యాంకు అకౌంట్లలో రైతుభరోసా డబ్బులు జమచేసినట్టు బుధవారం ఉదయం చాలామంది రైతులకు ఎస్ఎంఎస్లు రావడం తో అయోమయానికి గురయ్యారు.
- రైతులకు రేవంత్ ప్రభుత్వం బురిడీ
- కరువు కమ్మిన వేళ పెట్టుబడి సాయంపై పరాచికం
- రైతుబంధు ఖాతాల్లో జమచేసినట్టు ఫోన్లకు మెసేజ్‌లు
- పైసలు వేయకుండానే వేసినట్టు సర్కార్ సందేశాలు
- ఆదరాబాదరగా బ్యాంకులకు వెళ్లి భంగపడిన రైతులు
- ఎన్ఐసీ పొరపాటేనంటూ వ్యవసాయ శాఖ వివరణ
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయ్యాయంటూ సెల్ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లతో అన్నదాతలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. తెలంగాణ ప్రభు త్వం బ్యాంకు అకౌంట్లలో రైతుభరోసా డబ్బులు జమచేసినట్టు బుధవారం ఉదయం చాలామంది రైతులకు ఎస్ఎంఎస్లు రావడం తో అయోమయానికి గురయ్యారు. అయి తే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ అనధికారిక మెసేజ్‌ల వ్యవహారంపై స్పందించిన వ్యవసాయ శాఖ.. సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైతుభరోసా పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ.12 వేల చొప్పున నిధులు జమ అయినట్టు కొంతమంది రైతులకు మెసేజ్‌లు అందాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరుతో సందేశాలు రావడంతో చాలామంది రైతులు వాటిని నిజమని నమ్మారు. వెంటనే తమ బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా నగదు జమ కాలేదని గుర్తించారు. దీంతో రైతులు ఒకరికొకరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేశారు. కొందరు ఈ మెసేజ్‌లను వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు.. రైతుభరోసా నిధులు ఇంకా విడుదల కాలేదని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయని మొదట వ్యవసాయ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులకు ఇలాంటి మెసేజ్‌లు వెళ్లినట్టు గుర్తించడంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో.. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బీ గోపి.. తెలంగాణ డీజీపీ, సైబర్ క్రైమ్ విభాగం ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
రైతుభరోసా పథకం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,73,128 మంది రైతులకు అనధికారికంగా ఎస్ఎంఎస్లు వెళ్లినట్టు సీడీఏసీ పోర్టల్ రిపోర్ట్ ద్వారా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ మెసేజ్‌లను వ్యవసాయ శాఖ పంపించలేదని, రైతులకు ఇలాంటి మెసేజ్‌లు పంపేందుకు ఎవరికీ, ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. రైతులకు అధికారిక సమాచారాన్ని చేరవేసేందుకు వ్యవసాయ శాఖ సీడీఏసీ ఎస్ఎంఎస్ సర్వీస్ పోర్టల్‌ను వినియోగిస్తున్నదని వివరించారు. ప్రస్తుతం రైతులకు అందిన మెసేజ్‌లు వ్యవసాయ శాఖ అధికారిక పోర్టల్ ద్వారా పంపినవి కావని పేరొన్నారు. వ్యవసాయ శాఖ పేరును దుర్వినియోగం చేసి ఉండవచ్చని.. ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్ వ్యవస్థల్లోకి అనధికారికంగా ప్రవేశించడం, ఇతర ఎస్ఎంఎస్ గేట్‌వేల ద్వారా మెసేజ్‌లు పంపించడం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

