ఎర్రవెల్లి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం తన ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులను ‘బాగున్నరా అమ్మ’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. వారికి సాదర స్వాగతం పలికారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ వారికి అతిథి మర్యాదలు చేశారు. సంప్రదాయం ప్రకారం పసుపు కుంకుమలు, చీర, తాంబూలాలతో ఆ ఆడబిడ్డలను సత్కరించారు.
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి, వారిని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. మరికొద్ది రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుండటంతో జాతరను సందర్శించాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఆహ్వాన పత్రికను అందజేశారు. అదేవిధంగా మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందును మహిళా మంత్రులు స్వీకరించారు. కాసేపు పరస్పర యోగక్షేమాల గురించి వారు మాట్లాడుకున్నారు. ఇష్టాగోష్టి అనంతరం మహిళా మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు.
అంతకుముందు మహిళా మంత్రులు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం దగ్గర వాహనాలు దిగగానే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వారికి పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు.
బాగున్నరా.. అమ్మ!
రాష్ట్ర మహిళా మంత్రులకు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం
అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం
తన ఇంటికి వచ్చిన రాష్ట్ర… pic.twitter.com/6mrzyWoz86
— BRS Party (@BRSparty) January 8, 2026