తెలంగాణ సమాజం భగ్గుమంది. ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. నిరసనలతో హోరెత్తించింది. కదం కదం కదిపి నినదించింది. తెలంగాణ ఆడబిడ్డ, భారత జాగృతి అధ్యక్షురాలు కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. పలుచోట్ల బీఆర్ఎస్ మహిళా నేతలు సంజయ్ దిష్టిబొమ్మలను గాడిదపై ఊరేగించారు. చెప్పులతో కొడుతూ దహనం చేశారు. అంతేకాక అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మరొక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ బిడ్డా అంటూ హెచ్చరించారు.

Brsleader

Brsleader1