సింగపూర్: తెలుగు వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్.. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించాడు. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం చేజిక్కించుకున్న రాహుల్.. ఈసారి 96 కేజీల విభాగంలో బరిలోకి దిగనున్నాడు. సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ టోర్నీలో కాంస్య పతకం నెగ్గడం ద్వారా రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఆదివారం జరిగిన 96 కేజీల ఈవెంట్లో భారత్‌కే చెందిన వికాస్ ఠాకూర్ 339 (151+188) కేజీల బరువెత్తి స్వర్ణం కైవసం చేసుకోగా.. రాహుల్ 328 (146+188) కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు.