ఈ హోటల్కెళితే బయట చెప్పులు విడిచి.. కాళ్లు కడుక్కొని లోపలికెళ్లాలి.. లోపలికి వెళ్లగానే గుడిలోకి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది. అగర్బత్తీల సువాసనలు..ఓంకార నాదాలు..మనసును తేలికపరుస్తాయి. దేవతామూర్తుల ఫొటోలు భక్తిభావాన్ని కలిగిస్తాయి. సాంప్రదాయబద్ధ అలంకరణలు మన సంస్కృతిని గుర్తుచేస్తాయి. ప్లేట్ పట్టుకుని వెళ్తుంటే బ్రాహ్మణ వంటకాలు నోరూరిస్తుంటాయి. ఒక్కో వంటకానిది ఒక్కో ప్రత్యేక్యత. ఇదీ హైదరాబాద్లోని బ్రాహ్మణ భోజనం స్పెషాలిటీ..