చిగురుమామిడి, ఏప్రిల్ 15: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జయంతి వేడుకలను ఆటపాట కార్యక్రమాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగపరంగా అనేక చట్టాలు తీసుకువచ్చి వారి అభ్యున్నతి అంబేద్కర్ కోసం కృషి చేశారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడని న్యాయశాఖ ఆర్థికవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారని అన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల వారికి సమచిత న్యాయం జరిగిందన్నారు. మహిళలకు చదువుకునే అవకాశంతో పాటు అన్ని రంగాల్లో రాణించే విధంగా రాజ్యాంగాన్ని కల్పించాడని పేర్కొన్నారు. యువత ప్రధానంగా భారత రాజ్యాంగానికి అనుకూలంగా ముందుకు వెళ్లాలన్నారు. విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలన్నారు. చెడు అలవాటుకు బానిస కాకుండా ప్రయోజకులుగా మారాలని సూచించారు. అంబేద్కర్ స్ఫూర్తితో అందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అరుణోదయ కళానాట్యమండలి అధ్యక్షురాలు విమలక్క ఆలపించిన పాటలు సబికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అంబేద్కర్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు జేరిపోతుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు కొత్త కైలాసం, సన్నీల వెంకటేశం, శ్రీ మూర్తి రమేష్, వివిధ పార్టీల నాయకులు మంద శ్రీనివాస్, పెద్దపెల్లి అరుణ్ కుమార్, జేరిపోతుల వెంకటస్వామి, కానవేణి శ్రీనివాస్, కత్తుల రమేష్, మంద శ్రీనివాస్, కృష్ణమాచారి, లక్ష్మణ్, సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.