న్యూఢిల్లీ : కష్టసుఖాల్లో పాలుపంచుకుని అండగా నిలబడే ఫ్రెండ్ ఉండటం అదృష్టమే. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌కు స్నేహితుడి నుంచి ఇలాంటి స్వాంతన దొరికింది. యూట్యూబ్ చానల్ 100 మంది సబ్స్క్రైబర్ల మైలురాయిని దాటడంతో బాలుడికి తన ఫ్రెండ్ వుడెన్ ప్లేబటన్ను కానుకగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను మాట్ కోవల్ ట్విట్టర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
ఈ పోస్ట్‌లో బాలుడికి తన ఫ్రెండ్ బహుకరించిన వుడెన్ ప్లేబటన్ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. చెక్కతో చేసిన ప్లేబటన్పై యూట్యూబ్ లోగో కూడా ఉంది. కంటెంట్ క్రియేటర్లు లక్ష, పదిలక్షలు, కోటి, పది కోట్ల సబ్స్క్రైబర్లను చేరుకున్నప్పుడు యూట్యూబ్ వరుసగా సిల్వర్, గోల్డ్, డైమండ్, రెడ్ డైమండ్ ప్లేబటన్స్ను అందచేస్తున్న సంగతి తెలిసిందే.
నా కుమారుడు 100 మంది సబ్స్క్రైబర్ల మార్క్‌ను చేరుకోవడంతో ఈ వుడెన్ ప్లేబటన్ను అతడి ఫ్రెండ్ బహుకరించాడని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. మ్యాట్ కోవల్ పోస్ట్‌కు ఇప్పటివరకూ 66,000 లైక్స్ రాగా నెటిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో రియాక్షన్స్ వచ్చాయి. మీ కుమారుడు సాధించిన ఘనతకు అభినందనలని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మీ కొడుకు స్నేహితుడి స్పందన అద్భుతమని మరికొందరు యూజర్స్ కామెంట్ చేశారు.