
మహబూబ్‌నగర్, డిసెంబర్ 9 : అర్హులైన ప్రతిఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్ వేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్ కాలనీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించడంతోపాటు వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించాలని తెలిపారు. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌కు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం మండల అధికారులతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వందశాతం పూర్తి చేయాలి
జడ్చర్ల/టౌన్/రూరల్, డిసెంబర్ 9 : మున్సిపాలిటీలో వ్యాక్సినేషన్‌ను వందశాతం పూర్తి చేయాలని జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో గురువారం కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను చైర్‌పర్సన్‌తోపాటు అర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ శివకాంత్, మున్సిపల్ కమిషనర్ సునీత పర్యవేక్షించారు. అలాగే 24వ వార్డులో కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్‌రెడ్డి వైద్యసిబ్బంది కలిసి ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేయించారు. మండలంలోని పలు గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంపీడీవో జగదీశ్, గంగాపూర్ పీహెచ్సీ డాక్టర్ రాహుల్ పరిశీలించారు. పోలేపల్లి గ్రామంలో సర్పంచ్ చేతనారెడ్డి ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు సుల్తానా, సతీశ్, రమేశ్, ఉమాశంకర్‌గౌడ్, లత, టీఆర్ఎస్ నాయకులు దోరేపల్లి రవీందర్, సందీప్‌గౌడ్, కొండల్, నరేశ్, రామ్, నర్సింహరాజు, ఏఎన్ఎం మాలతి, పంచాయతీ కార్యదర్శి శివప్రకాశ్, ఆశ కార్యకర్తలు శివలీల, సరస్వతి, ఎల్లమ్మ, సాయిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ కేంద్రాల పరిశీలన
మూసాపేట, డిసెంబర్ 9 : మండలంలోని నిజాలాపూర్ గ్రామంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని తాసిల్దార్ మంజుల పరిశీలించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ రెండు డోసుల టీకా వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో సరోజ, పంచాయతీ కార్యదర్శి సురేశ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి
మిడ్జిల్, డిసెంబర్ 9 : వ్యాక్సినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని డీఎంవో విజయకుమార్ అన్నారు. మండలకేంద్రంతోపాటు బో యిన్‌పల్లి, మసిగుండ్లపల్లి వా డ్యాల్, కొత్తపల్లి, వేముల తదితర గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ వంశీప్రి య, డిప్యూటీ తాసిల్దార్ గీత, ఆర్ఐ రామాంజనేయులు, పంచాయతీ కార్యదర్శి బాబన్న, దేవయ్య, జంగయ్య, గీత, జ్యోతి, తిరుపతమ్మ, యాదమ్మ, రాజేశ్వర్ పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, డిసెంబర్ 9 : మండలకేంద్రంతోపాటు కుచ్చర్కల్. చెన్నవెల్లి గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంపీడీవో లక్ష్మీదేవి పర్యవేక్షించారు. అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో వెంకట్రాములు, డాక్టర్ ప్రతాప్చౌహాన్ ఉన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, డిసెంబర్ 9 : మండలంలోని పెద్దరేవల్లిలో వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేశారు. అలాగే కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సునీత ఉన్నారు.