హైదరాబాద్, సెప్టెంబర్ 10 : నేచురల్ ఇంగ్రిడెంట్స్, న్యూట్రాస్యూటికల్ ఇన్నోవేషన్ సంస్థ బొటానిక్ హెల్త్‌కేర్..హైదరాబాద్‌లో రూ.25 కోట్లతో పెట్టుబడితో మరో తయారీ కేంద్రాన్ని నెలకొల్పింది. కేవలం లైపోసోమల్ తయారు చేయడానికి ఈ యూనిట్‌ను ప్రత్యేకంగా నెలకొల్పినట్లు కంపెనీ ఫౌండర్, ఎండీ మధు కృష్ణమణి తెలిపారు.
ఈ నూతన యూనిట్‌తో ఇన్నోవేషన్ టెక్నాలజీ మరింత బలోపేతం కావడంతోపాటు 8,500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన ఈ యూనిట్లో ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నది. ఈ యూనిట్‌తో కొత్తగా 50 మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.