న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కంపెనీలు ధరలు తగ్గిస్తాయా అనేది అనుమానం కొనుగోలుదారుల్లో నెలకొన్నది. దీనిపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది ఇదే అనుమానం వ్యక్తంచేశారు. జీఎస్టీ రేట్లను రెండింటికి కుదించడంతో నిత్సావసర వస్తువులతోపాటు ఇతర ఉత్పత్తుల ధరలు దిగిరానున్నాయి.
కానీ ఆయా సంస్థలు ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులకు బదలాయించే అవకాశాలు లేవని అత్యధిక మంది అభిప్రాయపడ్డారు. దేశీయంగా నిర్వహించిన సర్వేలో 42 శాతం మంది ఎటు చెప్పలేకపోగా, 33 శాతం మంది మాత్రం కంపెనీలు గరిష్ఠ రిటైల్ ధరను తగ్గిస్తాయా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో 39 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 61 మంది పురుషులు కాగా, 39 శాతం మంది మహిళలు.