వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఐదు కిలోల బరువుతో బాబు జన్మించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామానికి చెందిన స్పందన ప్రసవం కోసం దవాఖానలో చేరారు. బుధవారం వైద్యులు ఆపరేషన్ చేయగా ఐదు కిలోల బరువున్న బాబు జన్మించినట్టు వైద్యులు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, ప్రతి వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయన్నారు. – వర్ధన్నపేట