Bonalu in London | తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. బోనాలకు సుమారు 2వేలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే తెలుగు బిజినెస్ చాంబర్ డైరెక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, టాక్ అధ్యక్షుడు రత్నాకర్, ఉపాధ్యక్షుడు శుష్మణరెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ తదితరులు పాల్గొన్నారు.