Bomb threat : ముంబై రైల్వేస్టేషన్లు, అమితాబ్ బంగ్లాకు బాంబు బెదిరింపు!
ముంబై రైల్వేస్టేషన్లు, అమితాబ్ బంగ్లాకు బాంబు బెదిరింపు! |

ముంబై : మహారాష్ట్ర ముంబైలోని ప్రముఖ మూడు రైల్వేస్టేషన్లతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ బంగ్లాకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. నాలుగు చోట్ల బాంబులు పెట్టినట్లు పోలీస్ కంట్రోల్ రూంకు శుక్రవారం అర్ధరాత్రి ఫోన్ రావడంతో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు ఆయా ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
అయితే, ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించగా.. అనుమానాస్పదంగా ఏదీ గుర్తించలేదని చెప్పారు. గుర్తు తెలియని దుండగులు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లతో పాటు జుహులోని అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు పెట్టినట్లు కాల్ వచ్చిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వా్డ్, డాగ్ స్క్వాడ్, స్థానిక పోలీసులు సిబ్బందితో పాటు రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయా ప్రదేశాలకు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ చేపట్టారన్నారు.
అయితే, అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఫోన్ కాల్ ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ భద్రతను మోహరించి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సదరు అధికారి వివరించారు.
ఇవి కూడా చదవండి..
మహింద్రా గ్రూప్ చైర్మన్‌గా ఆనంద్ గుడ్‌బై..?
No Rail Fare Concessions | రైలు టిక్కెట్లలో రాయితీ ఊసే లేదు..
Encounter : బుద్గాంలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
Covid-19 Vaccines : ‘ప్రైవేటు’కు 3.56కోట్ల కొవిడ్ టీకాలు : కేంద్రం
Srisailam Dam : శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద
Covid-19 Vaccine : బూస్టర్ డోస్‌పై వెనక్కి తగ్గని అగ్రరాజ్యాలు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

