కాజీపేట, ఆగస్ట్ 18 : కాజీపేట చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలను స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు బొల్లికొండ యాదగిరి విచ్చేసి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొఘల్ సామ్రాజ్యాన్ని సర్వాయి పాపన్న కూలదోసి గోల్కొండ కోటపై జెండాను ఎగరవేసి బహుజనులకు రాజ్యాధికారం కావాలని రాజకీయ చైతన్యాన్ని, పరిచయం చేశాడన్నారు.
ఆనాటి సమాజంలోని దుష్ట పరిపాలన, వెట్టి చాకిరి, దోపిడీకి వ్యతిరేకంగా గోల్కొండ కోట పై సవాలు చేసిన మొదటి తెలంగాణ బహుజన వీరుడు అన్నాడు. ఈ కార్యక్రమంలో బుర్ర బాబురావు, మోడం రాజేష్, బండి
కరుణాకర్, నాగపురి రాంకీ, పిల్లల కుమార్, మేడం రమేష్ పిల్లల సుధాకర్, బొల్లెపల్లి శేఖర్, బుల్లెపల్లి రాజేష్, బమ్మిరాజ్, పల్లగాని అమ్మయ్య, బుర్ర రామ్, బుర్ర శ్రీనివాస్, వేముల శ్రీనివాస్, తాళ్లపల్లి శ్యామ్, నాగపూర్ రఘు, నాగపురి చైతన్య తదితరులు పాల్గొన్నారు.