తమ చిన్న కుమారుడు ప్రణయ్ వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులను కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆహ్వానించారు. సతీసమేతంగా ఆదివారం నాడు కేటీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వానపత్రికను అందజేశారు.
డాక్టర్ రీతికతోప్రణయ్ పెళ్లి జూన్ 25వ తేదీ (గురువారం) న జరుగనుంది. ఉదయం 7.41 గంటలకు జన్వాడాలోని కే. కన్వెన్షన్ వేదికగా ప్రణయ్, రీతిక వైవాహిక జీవితంలో అడుగు పెట్టనున్నారు.