ముంబై, ఆగస్టు : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కి సరికొత్త వెహికల్ ను ప్రవేశపెట్టింది. ‘740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్’ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్ ధర ఇండియన్ ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 1.43 కోట్లు. దేశీయ మార్కెట్లో ఈ కొత్త బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్ మోడల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు.
న్యూ ఫీచర్స్…
కొత్త బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్ లేజర్‌లైట్ టెక్నాలజీకి అనుగుణంగా ఎల్ఈడీ హెడ్లైట్లను కలిగి ఉంటుంది. ఈ లగ్జరీ సెడాన్‌లో ఎమ్ స్పోర్ట్ ప్యాకేజీ స్టాండర్డ్ గా అందించనున్నారు. ఈ 740 ఎల్ఐ ఎమ్ ఎడిషన్ రెండు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి ‘టాంజానైట్ బ్లూ, ద్రవిట్ గ్రే’ కలర్స్. కొత్త బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్ స్పోర్ట్స్ మోడల్. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. 740 ఎల్ఐ ఎమ్ కారు 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్ గా పొందుతుంది. అయితే కొనుగోలుదారులు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ని కూడా ఎంచుకోవచ్చు. ఇందులో ఈ రెండు విభిన్న డిజైన్ లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుడు తమకు నచ్చినదానిని ఎంచుకోవచ్చు.
ఈ లగ్జరీ కారు ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. లోపలి భాగంలో నప్పా లెదర్ లభిస్తుంది. ఇది ప్రత్యేకంగా రూపొందించిన అల్కాంటారా హెడ్రెస్ట్ , బ్యాక్‌రెస్ట్ కుషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో డిజిటల్ 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే , 16 ఇంచెస్ వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ , 16-స్పీకర్ హెర్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటివి కూడా ఉన్నాయి.
ఇందులో 10.2 ఇంచెస్ పుల్లీ HD టచ్స్క్రీన్లు, 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ టాబ్లెట్ వంటివి వెనుక సీట్లో ఉన్నాయి. ఈ లగ్జరీ కారులో వివిధ రకాల రియర్ కొలీషియన్ అలెర్ట్, ట్రాఫిక్ వార్పింగ్ పార్కింగ్ అసిస్ట్ , లేన్ చేంజ్ అలెర్ట్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అటెన్టివెన్స్ అసిస్టెన్స్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నర్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఆటో హోల్డ్, ఎలక్ట్రిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్ , ISOFIX చైల్డ్ సీట్ మౌంటు వంటివి ఉన్నాయి. బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్ ఇప్పుడు 3-లీటర్, 6 సిలిండర్, డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 340 బిహెచ్పి పవర్ 1,500-5,200 ఆర్‌పిఎమ్ మధ్య 450 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ఇందులో నాలుగు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. ఎకో, ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ ,అడాప్టివ్ డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి.