(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): వయసు, బరువు, బీపీ, షుగర్, గుండె జబ్బులు, స్మోకింగ్ హిస్టరీ ఇలా.. పలు రిపోర్టులను ఆధారంగా చేసుకొని మనిషి ఆరోగ్య పరిస్థితిని ఇప్పటివరకూ అంచనా వేస్తూ వస్తున్నారు. అయితే, ఒకే ఒక్క బ్లడ్ టెస్టుతో.. 5-10 ఏండ్ల ముందుగానే మరణ ముప్పును పసిగట్టి అలర్ట్ చేసే ఆవిష్కరణకు యూకే పరిశోధకులు తాజాగా అంకురార్పణ చేశారు. రక్తంలోని ప్రొటీన్ నమూనా, పనితీరు ఆధారంగా ఓ బ్లడ్ టెస్టు ద్వారా ఆయుష్షును అంచనా వేయవచ్చని పరిశోధకులు తెలిపారు. యూకేకు చెందిన 38 వేల మందిపై చేసిన అధ్యయనంలో సానుకూల ఫలితాలు సాధించినట్టు పేర్కొన్నారు.