ప్రపంచ రక్తదాతల దినోత్సవం (Blood Donation ) సందర్భంగా కువైట్( Kuwait ) లోని భారత రాయబార ( Indian Embassy ) కార్యాలయం, బ్లడ్ డోనర్స్ కేరళ (BDK) , ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్ (FID) సంయుక్త ఆధ్వర్యంలో అదాన్ హాస్పిటల్ , బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించాయి.


ఈ శిబిరాన్ని భారత రాయబారి పరమిత త్రిపాఠి( Paramita Tripathi ), అల్ అహ్మది గవర్నరేట్ గవర్నర్ షేక్ హమౌద్ జాబెర్ అ ల్అహ్మద్ అల్ సబా ( Sheikh Hamoud Jaber Al-Ahmad Al-Sabah) ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ స్వయంగా తొలి రక్తదాతగా పాల్గొని అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి భారతీయ సమాజం నుంచి లభించిన విశేష స్పందనకు, రక్తదాతలకు , స్వచ్ఛంద సేవకులకు భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలియజేసింది.

Kuwait 3