New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
New Delhi : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆందోళనకర వాతావరణం కొనసాగుతోంది. సీజేపీ, ఎస్ఎఫ్ఐ సహా పలు సంఘాల నేతలు ఈసీకి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవ్వగా.. వారిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
New Delhi : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆందోళనకర వాతావరణం కొనసాగుతోంది. సీజేపీ, ఎస్ఎఫ్ఐ సహా పలు సంఘాల నేతలు ఈసీకి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవ్వగా.. వారిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులతోపాటు పలువురు జర్నలిస్టుల్ని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో అనేక మంది మహిళలు కూడా ఉన్నారు.
ప్రముఖ జాతీయ దినపత్రికలకు చెందిన జర్నలిస్టులు, డిజిటల్ జర్నలిస్టులు, కెమెరా పర్సన్స్ సహా మీడియాలో పని చేసే అనేక మందిని రైజైనా రోడ్‌లోని ప్రెస్ క్లబ్ బయట పోలీసులు అరెస్టు చేశారు. ప్రెస్ క్లబ్ బయట దాదాపు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారుల్ని కన్నాట్ ప్లేస్ నుంచి బస్సులో తరలిస్తుండగా.. వారిలో ఇద్దరు జర్నలిస్టులు, ఇద్దరు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. కొందరికి రక్తస్రావం కూడా జరిగింది.
రెండు బస్సుల్లో వంద మంది ఆందోళనకారుల్ని అరెస్టు చేసి, తరలించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే అంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. వీరిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో పలువురు నిరసనకారులపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆందోళనకారుల్ని అత్యవసరమైతే తప్ప అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మరోవైపు సీఈసీ రాజీనామా చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని సీజేపీ ప్రకటించింది.
ఇదే సమయంలో అన్ని పార్టీలు ఈ విషయంలో ఐక్యంగా ఉండాలని కోరింది. తాము ఆందోళన చేయబోమంటూ బాండ్‌పై సంతకం పెట్టినట్లు జరుగుతున్న ప్రచారాన్ని సీజేపీ నేతలు ఖండించారు. తాము ఎలాంటి బాండ్‌పై సంతకం చేయలేదని స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి ప్రముఖుల్ని ఢిల్లీ పోలీసులు శనివారమే అదుపులోకి తీసుకున్నారు. వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఇప్పటివరకు 7,000 మందికిపైగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

