Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Rajasthan | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) సరిహద్దులో రైల్వే ట్రాక్ (Railway Track) పై భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. రాజస్థాన్ (Rajasthan) లోని శ్రీగంగారామ్ (Srigangaram) జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడుకు కొన్ని నిమిషాల ముందే ఆ మార్గంలో ప్యాసింజర్ రైలు వెళ్లింది.
Rajasthan : భారత్-పాకిస్థాన్ (India-Pakistan) సరిహద్దులో రైల్వే ట్రాక్ (Railway Track) పై భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. రాజస్థాన్ (Rajasthan) లోని శ్రీగంగారామ్ (Srigangaram) జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడుకు కొన్ని నిమిషాల ముందే ఆ మార్గంలో ప్యాసింజర్ రైలు వెళ్లింది. ఆ పేలుడు ఏమాత్రం ముందు జరిగినా భారీగా ప్రాణనష్టం జరిగేది.
నిమిషాల వ్యవధిలో పేలుడు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. అధికారులు అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ రైల్వే ట్రాక్‌పై 50 జీబీ పాయింట్ సమీపంలో రాత్రి సమయంలో పేలుడు జరిగింది. దాంతో ట్రాక్ ఆధారంగా ఉండే రెండు కాంక్రీట్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. అక్కడ రెండు అడుగుల లోతు గుంత ఏర్పడింది. పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనతో వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. యాంటీ టెర్రరిజం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అనూప్‌గఢ్ జంక్షన్ నుంచి ప్యాసింజర్ రైలు బయలుదేరిన కొన్ని నిమిషాల తర్వాత ఈ పేలుడు జరిగింది. దాంతో ప్రయాణికుల రైలును పేల్చే కుట్ర ఏమైనా జరిగిందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల పాకిస్థాన్ సరిహద్దులో శ్రీగంగారామ్ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధాలు, ఆర్డీఎక్స్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ పేలుడు పదార్థాల స్వాధీనానికి, రైల్వే ట్రాక్‌పై పేలుడుకు ఏదైనా సంబంధం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

