
కోల్‌కతా, డిసెంబర్ 21: కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 144 వార్డులకు గాను 134 స్థానాలను టీఎంసీ కైవసం చేసుకోగా, బీజేపీ మూడింటిలో గెలిచింది. వామపక్ష కూటమి కంటే తక్కువ ఓటు షేరింగ్‌తో మూడో స్థానానికి పడిపోయింది. పోలైన ఓట్లలో తృణమూల్ 71.95 శాతం, లెఫ్ట్‌ఫ్రంట్-11.13, బీజేపీ-8.94, కాంగ్రెస్-4.47 శాతం పొందాయి. బీజేపీతో సమానంగా స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్‌లు చెరో 2 స్థానాలతో సరిపెట్టుకున్నాయి.